తెలంగాణ ఎడ్‌సెట్ 2023 షెడ్యూల్ విడుదల: పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్-2023 షెడ్యూల్ శనివారం విడుదలైంది.
హైదరాబాద్: తెలంగాణలో బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్-2023 షెడ్యూల్ శనివారం విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, టీఎస్ ఎడ్ సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి షెడ్యూల్ విడుదల చేశారు.
మార్చి 4వ తేదీన ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. 6వ తేదీ నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 500, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 30వ తేదీన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. మే 5 నుంచి ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మే 21న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు.
టీఎస్ సెట్ పరీక్ష వాయిదా
తెలంగాణలో టీఎస్ సెట్ పరీక్ష వాయిదా పడింది. మార్చి 13న జరగాల్సిన పరీక్ష ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. తదుపరి పరీక్ష షెడ్యూల్‌ను మార్చి 10 తేదీలోగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. 14,15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయన్నారు. తెలంగాణలోని యూనివర్శిటీలు, డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ (TS SET) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications