తెలంగాణా ఎన్నికలు: అన్ని పార్టీల ఫోకస్ వాళ్ళపైనే!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు యుద్ధ ప్రాతిపదికన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార బి ఆర్ ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తూ ఉంటే, ఈసారి బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, బిజెపిలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
ఇక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో మెజారిటీ ఓటు బ్యాంకుని తమ ఖాతాలో వేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కసరత్తులు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా పార్టీలన్నీ తమ ఫోకస్ ను యువత పైన పెట్టిన పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా గతం కంటే ఎక్కువగా యువఓటర్లు నమోదుకావడంతో వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అనేది అన్ని రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

యూత్ పైనే అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఇటీవల ఈసీ ప్రకటించిన డ్రాఫ్ట్ ఓటర్ల లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3,06, 42,333 మంది ఓటర్లు ఉండగా 18 ఏళ్ల నుండి 19 సంవత్సరాల మధ్య వయసు వారు 7లక్షల మంది దాకా ఉన్నారు. 19 ఏళ్ల నుండి 35 ఏళ్ల వయసు వారు 75 లక్షల మంది ఉన్నారు.
ఇక ఫైనల్ ఓటర్ల జాబితాలో యువ ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఓటర్లలో 30 శాతం మంది యువత ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ యువత పైన పెట్టినట్టుగా తెలుస్తుంది. యువతకు మద్దతుగా ఉద్యోగాల కోసం, నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ బిజెపి, జాబ్స్ విషయంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించి కాంగ్రెస్ పార్టీ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇక యువతను తమ వైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీలు బి ఆర్ ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. అయితే యువ ఓటర్లను టార్గెట్ చేస్తూ అన్ని పార్టీలు వ్యూహాలలో రచిస్తున్న వేళ వచ్చే ఎన్నికలలో యువత ఎవరికి పట్టం కడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications