ఖాతా తెరిచిన బీఆర్ఎస్: దుబ్బాక, భద్రాచలంలో బీఆర్ఎస్ విజయం!!
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాతా తెరిచింది. దుబ్బాక నియోజకవర్గం లోనూ, భద్రాచలం నియోజకవర్గం లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయ కేతనాన్ని ఎగరవేశారు. దుబ్బాక నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు పై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
మెదక్ జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు జరిగిన దాడిలో కత్తిపోట్లకు గురై ఆపరేషన్ చేయించుకుని, ప్రచారం కూడా చేయలేని పరిస్థితిలో ప్రజాక్షేత్రంలోకి రాలేక పోయినప్పటికీ దుబ్బాక ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తున్నపటికీ, కొత్త ప్రభాకర్ రెడ్డి పైన ఈ ఘటనతో సింపతి ఓట్లు నమోదు అయినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

భద్రాచలం అంటే సిపిఎం అని, కమ్యూనిస్టులకు భద్రాచలం పేరు అన్న ప్రచారం ఉన్నప్పటికీ భద్రాచలం నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ పార్టీ విజయం సాధించింది. భద్రాచలం నియోజకవర్గం లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో 4466 ఓట్లతో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు.
భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి పొదెం వీరయ్య, బిజెపి నుంచి కుంజా ధర్మారావు పోటీ పడగా, సిపిఎం అభ్యర్థిగా ఇక్కడ కారం పుల్లయ్య కూడా బరిలో ఉన్నారు. అయినప్పటికీ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఊహించని విధంగా ఇక్కడ విజయ కేతనాన్ని ఎగరవేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుండి గెలుపొంది, మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా బరిలోకి దిగిన పొదెం వీరయ్య పట్ల వ్యతిరేఖత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్తిని గెలిపించింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications