ఉగాది నుంచి కేసీఆర్ జాతకం ఎలా ఉందంటే!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. 2014 ఎన్నికల్లో అధికారం దక్కగా రెండోసారి 2018 ఎన్నికల్లో కూడా విజయం దక్కింది. అప్పటినుంచే ఆ పార్టీ పనితీరు మారిపోవడంతోపాటు ప్రభుత్వంలో అవినీతి చోటుచేసుకుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టారు. పార్టీ పేరు మార్చుకోవడం కూడా కేసీఆర్ చేసిన ఘోరతప్పిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పై ఎటువంటి అస్త్రాలను ప్రయోగించారో అవే అస్త్రాలను రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తిరిగి ప్రయోగిస్తున్నారు.
రేపటి నుంచి ఉగాది పర్వదినం. తెలుగు కొత్త సంవత్సరం క్రోధి నామంతో ప్రారంభం కాబోతోంది. క్రోధి నామ సంవత్సరంలో కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసి తెలుసుకుంటారు. 1954 ఫిబ్రవరి 17న జన్మించిన కేసీఆర్ జన్మ నక్షత్రం ఆశ్లేష. కర్కాటక రాశి. మే ఒకటో తేదీ నుంచి ఈ రాశివారికి బుద్ధి, సంతానం, ధనం, విద్యకు కారకుడైన గురుడు 11వ స్థానంలో ఉండటంవల్ల మంచి ఫలితాలు సాధించే అవకాశం కనపడుతోంది. అయితే అష్టమ శని వల్ల అష్టకష్టాలు పడొచ్చంటున్నారు. దీనివల్ల మానసికంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

కేతువు 3వ స్థానంలో ఉండటం వల్ల భక్తి కేసీఆర్‌ను కాపాడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆయన జాతకంలో గురువు మహర్దశలో ఉన్నారు. ఆయన యోగ కారకుడు. 2035 సెప్టెంబరు వరకు యోగం ఉంటుంది. శని, రాహువు, గురువు స్థితిగతులు బాగుండలేదు. దీనివల్ల కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై కూడా ఉంటుంది. అనారోగ్యం, మానసిక అశాంతి వంటివాటివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దగ్గరున్నవారు దూరమవడం, పక్కన ఉండేవారే పతనాన్ని కోరుకోవడంలాంటివి జరుగుతాయి. కోర్టు చిక్కులున్నాయి. మానసికంగా లాభం చేకూరడమనేది కొంతలో కొంత ఉపశమనం.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications