తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగుళూరు కి తరలించనున్న హై కమాండ్ ? ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహాయం?

తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ నెల 3వ తేదీన నిర్వహించబోయే ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలు ఎలా ఉండొచ్చనే విషయంపై తమ అంచనాలను వ్యక్తం చేశాయి. ఒకట్రెండు మినహా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. భారీ మెజారిటీని అందించాయి.

ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను ఎంత వరకు నిజం అవుతాయనేది ఈ నెల 3వ తేదీన తేలిపోతుంది. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ఆ రోజే ఓట్లను లెక్కిస్తారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, రాజస్థాన్‌లో బీజేపీ, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్.. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

Telangana exit polls 2023: Congress may shift its MLAs to Bengaluru on 3rd or 4th December

తెలంగాణలో బీఆర్ఎస్‌తో పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా సీట్లను సాధించడం, లేదా హంగ్ అసెంబ్లీ (Hung Assembly) ఏర్పడితే- క్యాంప్ రాజకీయాలకు తెర తీసినట్టే అవుతుంది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి క్యాంప్ రాజకీయాలకు దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

రాజకీయ ప్రత్యర్థుల నుంచి తమ పార్టీ సభ్యులకు రక్షణ కల్పించడానికి రిసార్టులకు తరలించే అవకాశం ఉంది. గెలిచిన వెంటనే తమ అభ్యర్థులను బెంగళూరుకు తరలించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు పూర్తిగా వెలువడిన రోజు రాత్రి లేదా ఆ మరుసటి రోజు రెండు ప్రైవేటు బస్సుల్లో బెంగళూరుకు షిఫ్ట్ చేస్తారని సమాచారం.

ఈ మేరకు కర్ణాటక పీసీసీ నాయకత్వానికి సమాచారం అందిందని చెబుతున్నారు. బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్‌ను సైతం బుక్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక పీసీసీ అధినేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. తెలంగాణ కాంగ్రెస్‌కు సహాయం చేస్తోన్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+