TRS పేరు ఎంపిక వెనుక..: చాలా ప్లాన్డ్ గా

తెలంగాణ రాజకీయ తెరపై మరో నూతన పార్టీ ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ పార్టీని నెలకొల్పారు. బీఆర్ఎస్ తర్వాత ఆ స్థాయిలో ప్రాంతీయ పార్టీ అంటూ పెద్దగా ఏదీ లేకపోవడంతో.. కవిత ఆ లోటును భర్తీ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ ఉదయం 10 గంటలకు మెదక్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ సందర్భంగా పార్టీ పేరును ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర సేన..

జై తెలంగాణ నినాదాల మధ్య టీఆర్ఎస్- తెలంగాణ రాష్ట్ర సేన పేరును ఆవిష్కరించారు కవిత. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇంకో రెండు సంవత్సరాల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతోన్నందున.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టేలా ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. పార్టీ పెట్టడానికి, టీఆర్ఎస్ పేరునే ఎంపిక చేయడానికి గల కారణాలను ఆమె వెల్లడించారు.

Telangana Future at Stake Kavitha Pledges 95 Percent Focus on Regional Issues with New TRS reignite

తెలంగాణ ప్రజా జాగృతి అనుకున్నా..

తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రెండు నెలల కిందటే పేరును రిజిస్టర్ చేయించారనే వార్తలు మొదట్లో వలువడ్డాయి. అయినప్పటికీ అది వాస్తవరూపం దాల్చలేదు. టీఆర్ఎస్ అనే పేరును చివరి నిమిషంలో ఖరారు చేశారు. టీఆర్ఎస్.. ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండకపోవచ్చు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నినాదం నుంచి పుట్టుకొచ్చిన ఈ పేరు రాష్ట్ర ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయింది. కోట్లాదిమంది ప్రజల గొంతుకగా మారింది. రెండుసార్లు అధికారాన్ని అందించిందా పార్టీ పెద్దలకు.

అదే తెలంగాణ సెంటిమెంట్..

ఆ తర్వాత టీఆర్ఎస్ తెరమరుగైంది. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. ఈ పేరుతో తెలంగాణ సెంటిమెంట్ కొట్టుకుపోయిందనే వాదనలు వినిపిస్తోండం, పేరు మార్చడం వల్లే 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందనే అభిప్రాయం ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు అదే తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసినట్టయింది.. టీఆర్ఎస్ పేరు పెట్టడంతో. కవిత తీసుకున్న ఈ నిర్ణయంతో టీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ రాజకీయాల దిశను మార్చుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

20 ఏళ్ల పాటు రక్తం, చెమట చిందించాం..

తెలంగాణ రాష్ట్ర సేన పేరును ఖరారు చేస్తూ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నామని, దీన్ని ఈసీ ఇంకా ధృవీకరించాల్సి ఉందని అన్నారు. టీఆర్ఎస్ అనే ఈ పేరు కోసం జీవితాంతం కృషి చేశామని, ఈ పార్టీని విజయవంతం చేయడానికి 20 ఏళ్ల పాటు రక్తం, చెమట చిందించామని కవిత భావోద్వేగంతో చెప్పారు. తెలంగాణ సాధించిన అనంతరం దురదృష్టవశాత్తు పరిస్థితులు తప్పుదారి పట్టాయని, తెలంగాణ ప్రజలు, యువత ఆకాంక్షలు ఎప్పుడూ నెరవేరలేదని పేర్కొన్నారు.

ఈ ఆకాంక్షలను నెరవేర్చడమే..

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గానీ నిజమైన తెలంగాణ సాకారం కావట్లేదని కవిత అన్నారు. దీన్ని సాధించడానికే పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. ఈ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఓ ప్రాంతీయ పార్టీగా మాత్రమే ఉంటుందని, 95 శాతం ఇక్కడి సమస్యలపై దృష్టి సారిస్తుందని తేల్చి చెప్పారు. ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, స్థానిక సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయంపై గళమెత్తుతామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+