ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు..! తేదీలివే..!
సంక్రాంతి పండుగ దగ్గరపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని జనం ఇప్పటికే పండుగ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్ధులు కూడా పండుగ సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు కూడా సంక్రాంతి సెలవులపై ప్రకటన వెలువడింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలకు ఈసారి సంక్రాంతి సెలవుల్ని ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఇవ్వాలని నిర్ణయించారు. తిరిగి ఈ నెల 19న కాలేజీలు తెరుచుకోనున్నాయి. గతేడాది విడుదల చేసిన ప్రస్తుత విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించారు. ఇందులో ఎలాంటి మార్పులు లేవని ఇంటర్ బోర్డు స్పష్టత ఇచ్చింది. దీంతో ఎల్లుండి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ కాలేజీలకు ఇంకా సంక్రాంతి సెలవులపై ప్రకటన రాలేదు. ఏపీలోనూ ఎల్లుండి నుంచే సంక్రాంతి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్ధులు ఎల్లుండి నుంచి పండగ మూడ్ లోకి వెళ్లిపోవడం ఖాయం. ఈసారి కూడా ఎప్పటిలాగే సంక్రాంతి సెలవులకు గ్రామాలకు తరలిపోయేందుకు జనం సిద్దమవుతున్నారు. విద్యార్ధులు కూడా సెలవులు ప్రకటిస్తుండటంతో పండగల్ని గ్రామాల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications