తెలంగాణలో దీపావళి సెలవు మార్పు-సర్కార్ ఉత్తర్వులు !

తెలంగాణలో ఈ ఏడాది దీపావళి సెలవులో మార్పు చోటు చేసుకుంది. గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి సెలవుగా ఇచ్చారు. అయితే తాజాగా పండితులు దీపావళి పండుగను నవంబర్ 13న జరుపుకోవాలని సూచించడంతో ప్రభుత్వం కూడా సెలవును మార్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నవంబర్ 13న సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

Recommended Video

    Diwali 2023... దీపావళి సెలువు రోజు మార్పు.. Government నుండి ఉత్తర్వులు .. | Telugu OneIndia
    telangana government changes diwali holiday to nov 13, orders issued

    ప్రతీ ఏటా ప్రకటించినట్లుగానే ఈ ఏడాది సెలవుల్ని కూడా తెలంగాణ ప్రభుత్వం గతేడాది చివర్లో విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 12వ తేదీ ఆదివారం సెలవుగా ఇచ్చారు. అయితే తాజాగా పండితుల నుంచి వచ్చిన సలహాలతో పాటు ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులతో సెలవును మార్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాధారణ సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని సంస్ధలు, వ్యాపార సముదాయాలకూ వర్తిస్తుంది.

    వాస్తవానికి గతంలో ఇచ్చిన ప్రకారం దీపావళి సెలవు నవంబర్ 12న ఉండటంతో నవంబర్ 13న ఆప్షనల్ హాలిడేగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని సవరించి నవంబర్ 13న దీపావళిని సాధారణ సెలవుగా మార్చారు. దీంతో పండుగ తర్వాత రోజు అయిన నవంబర్ 14న ఆప్షనల్ హాలిడే వర్తిస్తుంది. ప్రభుత్వం తాజాగా చేసిన మార్పుతో తెలంగాణలో ఎన్నికల వేళ విద్యాసంస్ధలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల వారాంతపు సెలవులు లభించినట్లయింది.

    తెలంగాణ వ్యాప్తంగా ఈసారి రెండో శనివారం సందర్భంగా నవంబర్ 11న ఎలాగో సెలవు ఉంది. తర్వాత రోజు ఆదివారం కావడంతో నవంబర్ 12న సెలవు ఉంటుంది. ఇప్పుడు దీపావళి సెలవు సందర్భంగా నవంబర్ 13న కూడా సెలవు లభించినట్లయింది. దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినట్లయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+