Holiday: జూన్ 17, 25న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం జూన్ 17న సెలవు ప్రకటించింది. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ ప్రభుత్వం సెలవు ఇచ్చింది. అయితే బక్రీద్ జూన్ 17న జరుపుకుంటారా లేదా జూన్ 18 జరుపుకుంటారా అనేది క్లారిటీ లేదు. దీంతో బక్రీద్ ఎప్పుడు జరుపుకుంటే అప్పుడు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 17న జరుపుకుంటే ఆ రోజు లేదా 18న జరుపుకుంటే ఆ రోజు సెలవు ఇస్తారు. బక్రీద్ ఘనంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు.

తెలంగాణలోని ఈద్గాలు, మసీదులు బక్రీద్ జరుపుకోవడానికి రెడీ అయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ లో బక్రీద్ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. బక్రీద్ సందర్భంగా గొర్రెలు, మేకలుకోస్తారు. దీంతో ఈ టైమ్ వాటికి భారీగా గిరాకీ ఉంటుంది. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్​తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేకలు, గొర్రెలను సిటీకి తీసుకొస్తున్నారు. మెహిదీపట్నం, లంగర్ హౌస్​రింగ్ రోడ్, టోలిచౌకి, జియాగూడ, అంబర్ పేట, కాచిగూడ, చాదర్ ఘాట్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో టెంట్లను ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతుంటారు.

Telangana government has declared holiday on June 17 and 25

గతంలో కంటే ఈసారి భారీ సంఖ్యలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను మార్కెట్లకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఉన్న మేకలు, పొట్టేళ్లు భారీ ధరలు పలకనున్నాయి. వరంగల్, జనగామ, ఇబ్రహీంపట్నం ఏరియాల నుంచి మేకలు, గొర్రెలను తీసుకొచ్చిన వ్యాపారులు ముషీరాబాద్ లోని ఏక్ మినార్, పఠాన్ బస్తీ, బోలక్ పూర్ ఏరియాల్లో అమ్ముతారు. ఇక్కడ ఒక మేకను రూ.12 వేల నుంచి 20 వేల మధ్యలో అమ్ముతారు.

బక్రీద్‌తో పాటు జూన్ 25 న వచ్చే ఈద్- ఎ -గదీర్‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లో 12వ నెల అయిన దుల్ హిజ్జా 10వ తేదీన బక్రీద్ జరుపుకుంటారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+