తీపి కబురు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Revanth Reddy Telangana Ambedkar Overseas Vidya Nidhi: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనాలను కల్పించే నిర్ణయం ఇది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (AOVN) పథకం కింద సీట్లను భారీగా పెంచింది. ఇప్పుడు ఉన్న సీట్లను రెట్టింపు చేసింది.

ప్రస్తుతం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఉండే సీట్ల సంఖ్య.. 210. ఇంతమంది విద్యార్థులు మాత్రమే ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యాను అభ్యసించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించేది. ఇప్పుడు ఈ సంఖ్యను భారీగా పెంచింది తెలంగాణ ప్రభుత్వం. 500లకు పెంచింది.

Telangana Government has enhanced the number of seats under this scheme

ఈ మేరకు జీవో జారీ అయింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఈ జీవోను జారీ చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం 500 మంది వరకు అర్హులైన ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉండే యూనివర్శిటీల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించినట్టయింది. దీనికి అనుగుణంగా బడ్జెట్ ను కూడా పెంచనుంది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణలోని ఎస్సీ విద్యార్థులకు ఇది అతిపెద్ద ప్రోత్సాహకంగా భావిస్తోన్నారు. ఈ చర్య విదేశీ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కుల (SC) విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుందని, వారి ఓవర్సీస్ విద్య కలలను సాకారం చేసినట్టవుతుందని చెబుతున్నారు.

షెడ్యూల్డ్ కుల అభివృద్ధి శాఖ ప్రతిపాదన తర్వాత.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద చదువుకునే విద్యార్థుల శాతం.. ఏకంగా 138కి పెరిగినట్టయింది.

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో ఆర్థికపరమైన అవరోధాల కారణంగా కేవలం 15 శాతం మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు మాత్రమే విదేశీ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎస్సీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+