సీఎంఆర్ఎఫ్‌ పొందాలంటే - నూతన మార్గదర్శకాలు..!!

సీఎం రేవంత్ పాలనా పరంగా ఫోకస్ చేసారు. ప్రజలతో మమేకం అయిన అంశాల పైన కొత్త నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటంతో ఇక పాలనా పరంగా చేయాల్సిన మార్పులను వేగవంతం చేసారు. అందులో భాగంగా..ముఖ్యమంత్రి సహాయ నిది అమలులో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. పక్కదారి పట్టేందుకు అవకాశం లేకుండా పారదర్శకంగా అమలు దిశగా ప్రభుత్వం తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆన్ లైన్ విధానంలో
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించాలని నిర్ణయించారు. సీఎంఆర్ఎఫ్ అమలు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో, ఇందు కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో వెబ్ సైట్ ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పెట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు.

Telangana Govt CMRF applications to be accepted only online see deets

కొత్త మార్గదర్శకాలు
తాజా విధానం మేరకు ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తు దారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేసారు. దరఖాస్తు అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇవ్వనున్నారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

15వ తేదీ నుంచి అమలు
ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ ఎఫ్ అప్లికేషన్ ను ఆమోదించి అబ్దిదారునికి చెక్ ను సిద్ధం చేస్తారు. చెక్ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్ లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారని..దరఖాస్తు దారులు. https//cmrf.telangana.gov.in\ సైట్ ద్వారా తమ అప్లికేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+