రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్- 765 చ.కి. విస్తీర్ణంలో
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. ఒకరకంగా ఇది రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్. తెలంగాణ దశ-దిశను మార్చివేసేలా ఇది రూపుదిద్దుకోనుంది.
ఫ్యూచర్ సిటీ పనులను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పేరుతో ఇది ఏర్పాటు చేసింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రే స్వయంగా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైస్ ఛైర్మన్‌గా ఉంటారు.
ఆర్థికం, మున్సిపాలిటీ, పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం, క్షేత్రస్థాయిలో దీన్ని అమలు చేయడం వంటి పనులను ఈ అథారిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది.

ఈ ఫ్యూచర్ సిటీ మొత్తం రంగారెడ్డి జిల్లాలో 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మితం కానుంది. మొత్తం 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఏర్పాటవుతుంది. అదే సమయంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిదిలో నుండి 36 రెవెన్యూ గ్రామాలను తొలగించింది. దాని పరిధిని 11 జిల్లాల్లో 1,355 గ్రామాలకు విస్తరించింది.
హెచ్ఎండీఏ మొత్తంగా 10,472.72 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ముచర్ల సమీపంలో రానున్న ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఆర్థిక, పారిశ్రామిక సమూహాలను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌ను 12 జోన్లుగా అభివృద్ధి చేస్తారు. ఇందులో సమగ్ర మాస్టర్ ప్లానింగ్, మల్టీ కనెక్టివిటీ, ఆధునిక పట్టణ సౌకర్యాలు, రేడియల్ రోడ్డుతో పాటు మెట్రో రైలు కనెక్టివిటీ వంటి భవిష్యత్-సిద్ధమైన ప్రాజెక్టులు ఉంటాయి.












Click it and Unblock the Notifications