విద్యార్థులకు రేవంత్ కొత్త కానుక- 24 వస్తువులతో కిట్స్, అందులో..!!

తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం కొత్తగా విద్యా కిట్స్ ఇవ్వాల ని డిసైడ్ అయింది. ఇందు కోసం కిట్స్ లో ఇవ్వాల్సిన వస్తువుల లిస్టు పైన నిర్ణయం తీసుకుంది. ఒక్కో కిట్‌లో 24 అవసరమైన వస్తువులు ఉండగా.. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి చేకూరనుంది. జూన్ నెలలో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరం వేళ ఈ కిట్స్ ను విద్యార్ధులకు అందించేలా కసరత్తు కొనసాగుతోంది.

విద్యార్ధుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూల్స్, గిరిజన విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లు అందించనుంది. ఒక్కో కిట్‌లో 24 అవసరమైన వస్తువులు ఉండగా.. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం అమలు చేయనుంది. ఈ కిట్స్ లో విద్యార్ధులకు అవసరమై 24 వస్తువులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగం గా విద్యార్ధుల స్కూల్ యూనిఫాం, వైట్ డ్రెస్, షూస్, సాక్సులు, బ్యాగ్, టై, బెల్ట్, ట్రాక్ సూట్, నైట్ డ్రెస్ వంటి దుస్తులతో పాటు.. బెడ్ షీట్, బ్లాంకెట్, టవల్ వంటి వసతి వస్తువులు కూడా అందిస్తారు. అలాగే ప్లేట్, గ్లాస్, కప్పు, స్పూన్, ట్రంక్ బాక్స్, స్టేషనరీ కిట్, నోట్‌బుక్స్ వంటివి కిట్స్ లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

telangana-govt-finalized-student-kits-to-distribute-in-up-coming-academic-year-begin-day-here-the-d

కొత్త విద్యా సంవత్సరం ఆరంభంలో పంపిణీ

ఈ కానుక జూన్ లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరం నుంచి అందించనున్నారు. దీని కోసం ఇప్పటికే ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. 24 వస్తువులను 9 కేటగిరీలుగా విభజించి ప్రత్యేక టెండర్లు పిలిచింది. ఎంపికైన గుత్తేదారులు 45 రోజుల్లోగా సరఫరా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి వస్తువుకు బార్‌కోడ్ కేటాయించి పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లా చర్యలు తీసుకుంటోంది. ప్రీ-బిడ్ సమావేశం కూడా నిర్వహించి టెండర్ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే డే స్కాలర్ విద్యార్థులకు కూడా ఉపశమనం కలిగేలా నిర్ణయం తీసుకుంది. వారికి బ్లాక్ షూస్, రెండు జతల సాక్సులు, బెల్ట్ ఇవ్వనుంది. దీని ద్వారా మరో 19 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం చాలా మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చెప్పులు లేకుండా స్కూల్‌కు వెళ్తుండగా... ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+