తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్..

TSPSC Group 1: వందలాది మంది అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉన్న గ్రూప్స్ పరీక్షల నిర్వహణ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోన్న వేళ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో వాయిదా పడిన గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసింది.

గ్రూప్ 1లో సర్వీస్ రిక్రూట్‌మెంట్ కింద ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి 2022 ఏప్రిల్ 26వ తేదీన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 04/2022 నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తంగా 503 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

Telangana group 1 services recruitment notification has been cancelled by TSPSC

వివిధ శాఖలు, విభాగాల్లో ఉన్న గ్రూప్ 1 సర్వీస్ రిక్రూట్‌మెంట్ ఖాళీలను గుర్తించి.. వాటిని భర్తీ చేయడానికి అప్పటి భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసం వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమౌతోన్నారు. పరీక్షల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తోన్నారు. ఈ దశలో టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 04/2022 నోటిఫికేషన్‌ మొత్తాన్నీ రద్దు చేసింది.

నిజానికి గతంలో మంజూరైన గ్రూప్ 1 పోస్టులకు తొలిదశలో అదనంగా మరో 60 ఖాళీలను భర్తీ చేయడానికి ఇటీవలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇదివరకే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

ఆయా ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసే బాధ్యతను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించింది. వివిధ శాఖలు, విభాగాల్లో తొలిదశలో 60 పోస్టులను భర్తీ చేయడానికి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే మరో కొత్త నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశిస్తోన్న దశలో మొత్తం నోటిఫికేషన్‌ రద్దు చేయడం సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+