అంత పెద్ద హైదరాబాద్ పెట్టుకుని కలెక్షన్లు భారీగా తగ్గడమేంటండీ
తెలంగాణలో జీఎస్టీ కలెక్షన్లు భారీగా తగ్గాయి. కిందటి నెలలో మైనస్ లోకి పడిపోయాయి. మైనస్ అయిదు శాతం మేర తగ్గాయి. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టినట్టియింది. దీనికి సమాధానాలు, వివరణలను ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించినట్టయింది. హైదరాబాద్ వంటి అతిపెద్ద నగరం ఉన్నా కూడా జీఎస్టీ తగ్గడం అనేది అటు ప్రభుత్వానికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి గల కారణాలను అన్వేషిస్తోంది.
సెప్టెంబర్ లో మొత్తం నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే జీఎస్టీ కలెక్షన్లు మైనస్ లోకి వెళ్లాయి. ఇందులో తెలంగాణ, ఢిల్లీ మాత్రమే ప్రధానమైనవి. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వసూళ్లు తగ్గాయి. హిమాచల్ ప్రదేశ్- మైనస్ 4, ఢిల్లీ- మైనస్ 1, మణిపూర్- మైనస్ ఒకటి, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింట్లో మైనస్ 8 శాతం మేర జీఎస్టీ క్షీణత కనిపించింది. తెలంగాణలో ఈ సంఖ్య ఏకంగా మైనస్ 5కు పడిపోయింది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు పెరిగాయి.

2024 సెప్టెంబర్ లో తెలంగాణలో 5,227 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది అదే నెలలో ఈ సంఖ్య 4,998 కోట్ల రూపాయలకు పడిపోయింది. హైదరాబాద్ వంటి అతి పెద్ద నగరం ఉన్నప్పటికీ.. జీఎస్టీ వసూళ్లు ఈ స్థాయిలో తగ్గడం అనేది అటు ప్రభుత్వాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి గల కారణాల గురించి ఆరా తీస్తోంది. ప్రస్తుత అక్టోబర్ నెలలో ఈ లోటును భర్తీ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంది.
ఈ తగ్గుదల ఆర్థిక విధ్వంసానికి కారణమని కేటీఆర్ విమర్శిస్తోన్నారు. జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలవడం అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. సరిగ్గా రెండేళ్ల కిందట తమ పాలనలో తెలంగాణ.. దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. రేవంత్ పరిపాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పడానికి ఇదొక తాజా సూచిక అని అన్నారు.
అన్ని రంగాలకు తమ ప్రభుత్వం ఇచ్చిన దన్నుతో ఆర్థికవ్యవస్థ పరుగులు తీసిందని గుర్తు చేశారు. వ్యవసాయం నుండి ఐటీ వరకూ
అన్ని రంగాలూ రికార్డులు తిరగరాశాయని పేర్కొన్నారు. ఇప్పుడు రేవంత్ పాలనలో పండగొచ్చినా, పబ్బమొచ్చినా కూడా వృద్ధి రేటు నేలచూపులే చూడాల్సి వస్తోందని అన్నారు. వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వరకూ అన్ని రంగాల్లో దైన్యం తాండవిస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications