ఆవుల అక్రమ రవాణాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా గోవుల తరలింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన ధృవ పత్రాలు లేకుండా గోవులను నగరంలోకి తరలించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. పోసులతోపాటు గోరక్ష దళ్‌‍కు చెందిన ఓ వ్యక్తి చెక్ పోస్టు వద్ద వాహనాలు ఆపి తనిఖీలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

సరైన ధృవ పత్రాలు పశువులను తరలిస్తున్న వాటిని సీజ్ చేయవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. పశువుల తరలింపుపై గో రక్ష దళ్ సభ్యులు, గో రక్షకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు స్పందించి.. పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

 telangana high court key comments on cows illegal transportation

గోవధ నిషేధం ఉన్నప్పటికీ అమలు కావడం లేదని, ఇందుకు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడమే కారణమని బీజేపీ, పలు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గోరక్ష దళ్ సభ్యులు ఇప్పటికే అక్రమంగా రవాణా చేస్తున్న వందలాది ఆవులను అడ్డుకుని కాపాడారు.

జీహెచ్ఎంసీపై ఆగ్రహం: హైదరాబాద్ రోడ్ల మరమ్మతులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల గుంతలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం పనితీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది.

రోడ్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు ఎన్ని దశాబ్దాలు కావాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు పోతుంటే మరమ్మతులకు దశాబ్దాలు తీసుకుంటారా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగి గంగాధర్ తిక్ దంపతులు పింఛను డబ్బుతో గుంతలు పూడ్చటంపై జరిగిన విచారణలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హైకోర్టు ఎదుట హాజరయ్యారు. రోడ్ల పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రతీ వర్షాకాలంలో నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి సరిచేయాలని హైకోర్టు ఈ సందర్భంగా అధికారులున ఆదేశించింది.

వరద నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు పెంచాలని, రాష్ట్రమంతటికీ ఆదర్శంగా నిలిచేలా హైదరాబాద్ ఉండాలన్నారు హైకోర్టు న్యాయమూర్తి. అంతర్జాతీయంగా పేరున్న హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి అవసరమని హైకోర్టు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+