బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యే అంశం పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టు తాజా అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటీషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందుంచాలని స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దీని విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వచ్చిన అనర్హత పిటీషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణ పైన సమాచారం ఇస్తూ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీ మారిన వారి పైన వచ్చిన ఫిర్యాదుల గురించి ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెబుతున్నారు.

Telangana High Court latest orders for Assembly Secretary over MLA s Diqualification

నాలుగు వారాల సమయం
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్‌ 24న దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్‌), దానం నాగేందర్‌ (ఖైరతాబాద్‌), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేసారు. అయితే, ఈ ముగ్గురితో పాటుగా పార్టీ మారిన వారి పైన అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసారు. దీని పైన విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లో స్పీకర్ షెడ్యూల్ ఖరారు చేసి...నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

స్పీకర్ నిర్ణయం ఏంటి
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అసెంబ్లీ కార్యదర్శి వద్ద ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అనర్హత పిటీషన్లను స్పీకర్ వద్ద తక్షణం ఉంచాల్సి ఉంటుంది. నాలుగు వారాల్లోగా విచారణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాలని..ఆ తేదీలను హైకోర్టుకు సమాచారం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. తమ పిటీషన్ల పైన స్పీకర్ కాలయాపన చేస్తున్నారనేది పిటీషనర్ల ప్రధాన ఫిర్యాదు. ఇక, ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాల తో అసెంబ్లీ కార్యదర్శి వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో, స్పీకర్ తుది నిర్ణయం కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+