తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌.. షాకింగా ఆ సైట్ ఓపెన్ ??

తెలంగాణలోని హైదరాబాద్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర న్యాయవ్యవస్థకు కీలకమైన తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ఆర్డర్ కాపీలు, కేసు వివరాలు లేదా ఇతర అధికారిక పత్రాలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వినియోగదారులు సైట్‌లోకి లాగిన్ అవుతుంటారు. కానీ వారికి PDF ఫైల్‌ల బదులు BDG SLOT అనే ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రీడైరెక్ట్ సమస్య బయటపడడంతో తీవ్రచర్చనీయాంశంగా మారింది.

కాగా సమస్యను గుర్తించిన వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం దీనిపై స్పందించింది. అధికారికంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు నమోదు చేసింది. ఇది సాధారణ టెక్నికల్ గ్లిచ్ కాదని.. హ్యాకింగ్ పనే అని భావించిన అధికారులు వెంటనే విచారణ కోసం పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఘటనను సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు.

telangana-high-court-official-website-hacked

అయితే ఈ హ్యాకింగ్ వెనుక ఉన్న వ్యక్తులు లేదా గ్యాంగ్ ఎవరు? హ్యాకర్లు సర్వర్‌లోకి ఎలా చొరబడ్డారు? సర్వర్ సెక్వరిటీలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఈ రీడైరెక్ట్‌లో మాల్వేర్‌ను ఉపయోగించారా? అనే అంశాలపై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. హ్యాకింగ్ కారణంగా కొంతసేపు హైకోర్టు వెబ్‌సైట్ పూర్తిగా యాక్సెస్‌ కాదని అధికారులు వెల్లడించారు. తదుపరి విచారణ తేదీ తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను వాడుతుంటారు. అలాంటి కీలక సమయంలో సైట్ పనిచేయకపోవడంతో న్యాయవాదులు, లిటిగెంట్లు ఇబ్బందులకు గురయ్యారు.

ఇక హైకోర్టు టెక్నికల్ టీమ్, ఐటీ నిపుణులు వెంటనే రంగంలోకి దిగారు. హ్యాక్ అయిన మార్గాలను మూసివేయడం, వెబ్‌సైట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను అప్‌డేట్ చేయడం ప్రారంభించారు. అలానే సర్వర్ ఎన్క్రిప్షన్‌ను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వెబ్‌సైట్ మామూలు స్థితికి రావడానికి పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్ జరగడం సాధారణం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు "సెక్యూరిటీ అప్రమత్తతకు పెద్ద హెచ్చరిక"గా అభివర్ణిస్తున్నారు.

ఇది దృష్టిలో పెట్టుకుని హైకోర్టు భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు రాబోయే అవకాశం ఉందని తెలుస్తోంది. సర్వర్‌లకు మల్టీ-లేయర్ సెక్యూరిటీ, డేటాబేస్ ఎన్క్రిప్షన్.. రియల్‌టైమ్ మానిటరింగ్,
ఎథికల్ హ్యాకర్లతో పెనెట్రేషన్ టెస్టింగ్ వంటి చర్యలను అమలు చేసే అవకాశాలపై అధికారులు ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో ఏఏ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+