2025లో తెలంగాణ సెలవులు ఇవే: ఆదివారంలో కలిసిన నాలుగు పండగలు: ఆ నెలల్లో ఒకే హాలిడే
Telangana holidays 2025: వచ్చే సంవత్సరంలో సెలవుల జాబితాను విడుదల చేసిింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించన ఓ నోటిఫికేషన్ కొద్దిసేపటి కిందటే జారీ అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేలు ఇందులో ఉన్నాయి. సంక్రాంతి, హోలీ, దసరా, దీపావళి, క్రిస్మస్‌లతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. ఇక గణతంత్ర దినోత్సవంతో పాటు ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం పండగలు ఆదివారం నాటి సెలవులో కలిసిపోయాయి.

సాధారణ పండగల కేటగిరీలో జనవరి 1- బుధవారం, జనవరి 13 భోగి- సోమవారం, జనవరి 14 సంక్రాంతి- మంగళవారం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం- ఆదివారం వచ్చాయి. ఫిబ్రవరిలో ఒకే ఒక్క సెలవు రావడం గమనార్హం. ఆ ఒక్కటి మహా శివరాత్రి. ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం ఈ పండగ ఉంటుంది.
మార్చి 14 హోలీ- శుక్రవారం, మార్చి 30 ఉగాది- ఆదివారం, మార్చి 31 రంజాన్- సోమవారం, ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్ రామ్ జయంతి- శనివారం, ఏప్రిల్ 6 శ్రీరామ నవమి- ఆదివారం, ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి- సోమవారం, ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే-శుక్రవారం జరుపుకోవాల్సి ఉంటుంది.
మే నెలలో ఒక్క హాలిడే కూడా లేదు. జూన్ 7 బక్రీద్- శనివారం, జులై 6 మొహర్రం- ఆదివారం, జూన్ 21 బోనాలు- సోమవారం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం- శుక్రవారం, ఆగస్టు 16 శ్రీకృష్ణాష్టమి- శనివారం, ఆగస్టు 27 వినాయక చవితి- బుధవారం షెడ్యూల్ అయ్యాయి.
సెప్టెంబర్ 5 మిలాడినబి- శుక్రవారం, సెప్టెంబర్ 21 బతుకమ్మ వేడుకలు ప్రారంభం- ఆదివారం, అక్టోబర్ 2 గాంధీ జయంతి- గురువారం, సెప్టెంబర్ 3 విజయదశమి- శుక్రవారం, సెప్టెంబర్ 20 దీపావళి- సోమవారం, నవంబర్ 5 కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి- బుధవారం, డిసెంబర్ 25 క్రిస్మస్- గురువారం సెలవులు ఉంటాయి.












Click it and Unblock the Notifications