గన్‌మెన్ చెంప పగలకొట్టిన హోంమంత్రి..తప్పని వారించిన మరో మంత్రి..వీడియో వైరల్
తెలంగాణ మంత్రులు ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే మంత్రి తలసాని ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సమయంలో మంత్రి కేటీఆర్ పక్కన నడుస్తున్న బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్‌ను వెనక్కి లాగి మరి చెంప దెబ్బ కొట్టారు.
గన్‌మెన్ చెంప పగలకొట్టిన హోంమంత్రి..తప్పని వారించిన మరో మంత్రి#MumammadAli #HomeMinister #TalasaniSrinivasYadav #GunMen #Oneindiatelugu pic.twitter.com/hhdXcJtWba
— oneindiatelugu (@oneindiatelugu) October 6, 2023
ఈ ఘటన మరువక ముందే అధికార బీఆర్ఎస్‌లోని మరో మంత్రి వివాదంలో చిక్కుకున్నారు.తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్‌మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయినహోంమంత్రి గన్‌మెన్‌పై చేయి చేసుకున్నారు.

ఆయనను తలసాని వద్దులేండీ అంటూ వారించారు. హోంమంత్రి మహమూద్ అలీ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న కారణానికే గన్‌మెన్‌ను కొట్టాలా అంటూ హోంమంత్రి మహమూద్ అలీపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications