తెలంగాణలో జూన్ 15 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం, పరీక్షలు, సెలవుల వివరాలు
హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సారినికి సంబంధించి ఇంటర్మీడియట్ తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను నేడు ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
ఈ ఏడాది మొత్తం 221 పని రోజులతో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది. అలాగే మొదటి సంవత్సరం తరగతులను జులై 1 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఇంటర్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 221 పని రోజులుంటాయి. జూన్ 15 నుంచి సెకండియర్, జులై 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు మొదలవుతాయి.

అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమలు అవుతాయి. 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. వచ్చే ఏడాది జూన్ 1న కాలేజీలు పునర్ ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది.












Click it and Unblock the Notifications