ఏజెంట్ దగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో తెలంగాణ యువకుడు మృతి?

ఆయిల్ పరిశ్రమలో ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మబలకడంతో రష్యా వెళ్లిన తెలంగాణ యువకుడు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో బలవంతపు సైనిక విధుల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడకు చెందిన అఫ్జల్ ఖాన్ గత వారం యుద్ధంలో మరణించారని, తోటి యువకుడు శిర్షు అశోక్ తన కుటుంబానికి పంపిన వాయిస్ మెసేజ్‌తో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించి అఫ్జల్ ఖాన్ పరిస్థితిపై స్పష్టతనివ్వాలని.. అక్కడే చిక్కుకుపోయిన మిగత తెలంగాణ యువకులను సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

 వేసవిని తలపిస్తున్న అక్టోబర్ ఎండలు - అప్పటి వరకు ఇంతే, తాజా అలర్ట్స్..!!
వేసవిని తలపిస్తున్న అక్టోబర్ ఎండలు - అప్పటి వరకు ఇంతే, తాజా అలర్ట్స్..!!

ఆయిల్ పరిశ్రమలో సాధారణ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో అఫ్జల్ ఖాన్ 2026 ఫిబ్రవరి 15న రష్యాకు వెళ్లినట్లు సమాచారం. అఫ్జల్ ఖాన్‌తో పాటు రష్యా వెళ్లిన శిర్షు అశోక్ అనే మరో యువకుడు తన భార్యకు పంపిన వాయిస్ మెసేజ్‌లో అతడు మరణించినట్లు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోరాడుతూ అఫ్జల్ ఖాన్ గతవారం చనిపోయాడని అశోక్ ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఏజెంట్ మాటలు నమ్మి ఉద్యోగం కోసం వెళ్లి రష్యన్ మిలిటరీ క్యాంపులో చిక్కుకున్న వీరిద్దరినీ బలవంతంగా సరిహద్దుల్లో సైనిక విధుల్లోకి దించినట్లు తెలుస్తోంది.

Telangana Man Afzal Khan Feared Dead in Russia-Ukraine War Family Urges Govt to Rescue Stranded Youths
కేబీఆర్ పార్క్ ఎలివేటేడ్ కారిడార్ కోసం కోట్ల విలువైన ఇంటి స్థలం ఇస్తున్న బాలకృష్ణ!
కేబీఆర్ పార్క్ ఎలివేటేడ్ కారిడార్ కోసం కోట్ల విలువైన ఇంటి స్థలం ఇస్తున్న బాలకృష్ణ!

ఈ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అఫ్జల్ ఖాన్ కుటుంబ సభ్యులు, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి రష్యా అధికారులతో మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని, ఒకవేళ మరణవార్త నిజమైతే ఆయన భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించాలని ఆవేదనతో కోరుతున్నారు. మరోవైపు రష్యన్ సైనిక క్యాంపులో చిక్కుకుపోయిన భూక్యా రవీందర్, శిర్షు అశోక్, మేగావత్ ప్రకాష్‌లకు చెందిన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారిని సురక్షితంగా ఇండియాకు తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+