ఒక్క సినిమా కూడా రిలీజ్ కాదు..! పవన్ కు మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్..!

తెలంగాణను రాజకీయ నేతల్ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా వాలిపోయిన కొబ్బరి చెట్లను చూసి తెలంగాణ నేతల దిష్టి తగిలిదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్ను తప్పుబడుతూ ఇవాళ వరుస వార్నింగ్ లు ఇస్తున్నారు.

తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ వాలిపోయిన కొబ్బరిచెట్లను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నరుడి దిష్టి నలభయ్యేళ్లని, రోళ్లు కూడా పగిలిపోతాయంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ వాళ్ల దిష్టి తగిలే ఇలా జరిగిందంటూ ఆరోపించారు. అప్పట్లో గోదావరి జిల్లాల పచ్చదనం చూసి తెలంగాణ నేతలు రాష్ట్ర విభజనకు డిమాండ్ చేశారని వెల్లడించారు. దీనిపై తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి పవన్ పై తీవ్రంగా మండిపడ్డారు.

Telangana Minister Komatireddy Warns Pawan Kalyan Retract Remarks or Face Movie Ban

పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఆయన సినిమాలు ఒక్క థియేటర్లో కూడా రిలీజ్ కానివ్వబోనని తీవ్ర హెచ్చరిక చేశారు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ నేతల దిష్టితగల్లేదని, ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషపు నీటిని తాగారన్నారు.

Telangana Minister Komatireddy Warns Pawan Kalyan Retract Remarks or Face Movie Ban

దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల వెనుకబాటుకు కారణమైన ఆంధ్ర పాలకుల్ని ప్రశ్నించకుండా.. తమపై నిందలు వేస్తారా అని కోమటిరెడ్డి నిలదీశారు. అలాగే పవన్ కళ్యాణ్ కు తగిన పాలన అనుభవం లేకపోవడం వల్లే ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలు చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి ఆయనకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+