నిక్కీ హేలీని కలిసిన మంత్రి కేటీఆర్: హైదరాబాద్‌లో మరో అమెరికా సంస్థ పెట్టుబడి
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీబీజీగా గడుతున్నారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు అవుతున్నారు. తాజాగా, ఐక్యరాజ్యసమితి మాజీ అంబాసిడర్, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హెలీ(Nikki Haley)ని మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యత గురించి నిక్కీ హెలీతో మంత్రి కేటీఆర్ వివరించారు.
నిక్కీ హేలీతో దిగిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు మంత్రి కేటీఆర్. ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలు, రాజకీయాల గురించి నిక్కీ హెలీతో విస్తృత స్థాయిలో అభిప్రాయాలను పంచుకున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీపడుతన్న నేపథ్యంలో నిక్కీకి మంత్రి కేటీఆర్ బెస్ట్ విషెస్ తెలిపారు.

మరోవైపు, అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ చొరవతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్ నగరం ప్రపంచానికి హెల్త్-టెక్ మక్కాగా అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో డిజిటలైజేషన్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడల విషయమై చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా భాగ్యనగరంలో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సైంటిఫిక్ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ క్లోవర్టెక్ ప్రకటించింది.
It was an absolute pleasure interacting with @NikkiHaley Former UN Ambassador & Governor of South Carolina
— KTR (@KTRBRS) May 23, 2023
Briefed her on the strategic importance of Hyderabad & Telangana in the larger context of US - India relations
Also discussed economy, elections and exchanged views on… pic.twitter.com/PDyxnbwu3b
మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన ఈ సంస్థ సీఈవో క్లితిజ్ కుమార్ ఈ ప్రకటన చేశారు. ఈ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ రూ. 100 కోట్ల పెట్టుబడితో 100 నుంచి 150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అడ్వాన్స్‌డ్ బయో ఇన్ఫర్మేటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్ కోసం హైదరాబాద్ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. క్లోవర్టెక్స్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా వెలుపల ఆ సంస్థ మొదటి కేంద్రం హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేయడం మంచి విషయన్నారు.












Click it and Unblock the Notifications