తెలంగాణలో కథ మళ్లీ మొదటికి: పుంజుకొన్న పాజిటివ్ కేసులు: తగ్గినట్టే తగ్గి..అనూహ్యంగా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఒక్కసారిగా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పుంజుకొంది. షరా మామూలే అనే స్థితికి చేరుకుంది. ఎప్పట్లాగే రాష్ట్రవ్యాప్తంగా రెండువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం కరోనా శాంపిళ్ల టెస్టుల సంఖ్యను పెంచిందని, దానికి అనుగుణంగా కేసులూ అధికం అయ్యాయని అధికారులు చెబుతున్నారు. యాక్టివ్ కేసుల్లో క్షీణత తగ్గుదల కొనసాగుతోందని వెల్లడించారు. 30 వేలకు దిగువనే యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఈ మేరకు అధికారులు తాజా బులెటిన్‌ను విడుదల చేశారు.

తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,166 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 2,143 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుప్రతులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,74,774కు చేరుకున్నాయి. ఇందులో 1,44,073 మంది డిశ్చార్జి కాగా.. 1,052 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో చికిత్స పొందుతోన్న కరోనా పేషెంట్ల సంఖ్య 29,649గా నమోదైంది. గృహాలు, ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతోన్న వారి సంఖ్య 22,620కి చేరింది.

 Telangana: Newly 2166 Covid19 positive cases and 10 deaths reported in last 24 hours

కొత్తగా 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్-21, భద్రాద్రి కొత్తగూడెం-79, జగిత్యాల-21, జనగామ-79, జయశంకర్ భూపాలపల్లి-20, జోగుళాంబ గద్వాల-20, కామారెడ్డి-50, కరీంనగర్-127, ఖమ్మం-87, కొమరంభీమ్ ఆసిఫాబాద్-19, మహబూబ్ నగర్-28, మహబూబాబాద్-90, మంచిర్యాల-43, మెదక్-36, మేడ్చల్ మల్కాజ్‌గిరి-147, ములుగు-22, నాగర్ కర్నూలు-46, నల్లగొండ-113, నారాయణపేట్-11, నిర్మల్-22, నిజామాబాద్-90, పెద్దపల్లి-50, రాజన్న సిరిసిల్ల-51, రంగారెడ్డి-166, సంగారెడ్డి-44, సిద్ధిపేట్-88, సూర్యాపేట్-64, వికారాబాాద్-24, వనపర్తి-33, వరంగల్ రూరల్-23, వరంగల్ అర్బన్-95, యాదాద్రి భువనగిరి-48 కేసులు నమోదు అయ్యాయి.

24 గంటల వ్యవధిలో మొత్తం 53,690 కరోనా వైరస్ శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం శాంపిళ్ల సంఖ్య 25,73,005కు చేరింది. సగటున ప్రతి 10 లక్షలమంది జనాభాలో 69,304 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Recommended Video

    Telangana లో Women Commission ఏర్పాటు కోసం రోడ్డెక్కిన TTDP మహిళలు..

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+