Revanthreddy: రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ!.. ఆమె ఎవరు ఎక్కడుంది..?
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఎవరికీ తెలియదు. తాను చదువుకునే రోజుల్లోనే ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఈ కథలో సినిమాలోకన్నా ఎక్కువ ట్విస్టులున్నాయి. చివరకు ఇరువైపులా పెద్దలను ఒప్పించి తాను ప్రేమించిన గీతారెడ్డినే పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరి లవ్ స్టోరీ ఇంటర్మీడియట్ లో మొదలైంది. నాగార్జునసాగర్ లో మొదటిసారి కలిశారు. అక్కడ మొదలైన పరిచయం స్నేహంగా మారింది. తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేయగా ఆయన వ్యక్తిత్వం నచ్చడంతో గీతారెడ్డి కూడా వెంటనే ఓకే చెప్పేశారు. వీరి ప్రేమ కథకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రేవంత్ రెడ్డి, తన కూతురు గీతారెడ్డి ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, మొదట్లో వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పారు. ఆ తర్వాత గీతా రెడ్డిని తన సోదరుడు, అప్పటి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపించామని, పై చదువుల కోసం ఢిల్లీలోని తన సోదరుడు జైపాల్ రెడ్డి ఇంటికి పంపించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం తనకు కూడా నచ్చిందన్నారు. సామాజికవర్గం కూడా ఒకటే కావడంతో పెళ్లికి అంగీకరించినట్లు తెలిపారు. 1992లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
రాజకీయాల్లో రెబల్ లీడర్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి సంచలనాలకు కేరాఫ్ గా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అనుకున్న సమయంలో పగ్గాలు చేపట్టి జీరో నుంచి హీరోగా చేశారు. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. చిన్నతనం నుంచి స్టూడెంట్ లీడర్ చురుగ్గా ఉండే రేవంత్ ఇండిపెండెంట్ జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందారు.












Click it and Unblock the Notifications