పోర్న్ వీడియోలు చూసేవారికి బిగ్ షాక్.. తెలంగాణ పోలీస్ సంచలన ప్రకటన
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనే యువత ఎక్కువగా గడుపుతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్ .. అంటూ రాత్రింబవళ్లు ఇంటర్ నెట్ లోనే మునిగి తేలుతున్నారు. ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో చిన్నవయసులోనే పిల్లల చేతికి సెల్ ఫోన్ తల్లిదండ్రులు ఇస్తున్నారు. కానీ వాళ్లు ఏం చేస్తున్నారు.. ఏం చూస్తున్నారు అన్నదానిపై నిఘాత్రం పెట్టడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసు శాఖ సంచలన ప్రకటన చేసింది.
ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఇంటర్ వినియోగం పెరిగిపోయింది. ఈ క్రమంలో శృంగార వీడియోలు చూడడం అధికం అయిపోయింది. ఈ మేరకు వీటిని నియంత్రించేందుకు నేషనల్, ఇంటర్ నేషనల్ సంస్థలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది.

చిన్నారుల అశ్లీల వీడియోలు (చైల్డ్ పోర్నోగ్రఫీ) చూసే వారిని టెక్నాలజీ సాయంతో గుర్తించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది పోలీస్ శాఖ. గతేడాది ఆగస్టు నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 520 పోక్సో కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా కీలక పోస్టు పెట్టారు.
అశ్లీల చిత్రాలను చూడటం, షేర్ చేయడం నేరం. చైల్డ్ పోర్నోగ్రఫీని చూసేవారిపై నిఘా ఉంటుంది. ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వొద్దు. చిక్కుల్లో పడొద్దు.#telanganapolice pic.twitter.com/uZDgcNWHCL
— Telangana Police (@TelanganaCOPs) June 6, 2025
అశ్లీల చిత్రాలను చూడటం, షేర్ చేయడం నేరం. చైల్డ్ పోర్నోగ్రఫీని చూసేవారిపై నిఘా ఉంటుంది. ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వొద్దు. చిక్కుల్లో పడొద్దు అని పోస్టు చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో తాజాగా ఐదుగురు అరెస్ట్ అయినట్లు తెలిపింది. ఈ ఐదుగురు.. హైదరాబాద్ చార్మినార్ ఈడీ బజార్ కు చెందిన మొహియుద్దీన్, ఫలక్ నూమా కందికల్ గేట్ కు చెందిన భానుబేగం, సికింద్రాబాద్ పార్క్‌లైన్ కు చెందిన ప్రసాద్ కుమార్, హబీబ్ నగర్ మల్లేపల్లికి చెందిన మహ్మద్ జకీర్, నల్గొండ జిల్లా ఆత్మకూరు కు చెందిన భాగ్యమ్మ పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)పోలీసులు కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications