తెలంగాణాను 'వదల బొమ్మాళీ' అంటున్న వరుణదేవుడు!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతోను, అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంతోను వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జులై నెలలో పడిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జల కళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు నిండి నిండుకుండల్లా తలపిస్తున్నాయి .
నేడు కూడా వర్షాలు
ఒక్క నాగార్జునసాగర్ మినహాయించి మిగతా అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా ఉంటే ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాలలోనే భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాలలో భారీ వర్షాలు
గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వర్షాలతో జాగ్రత్త
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలతో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా చూసుకుంటే మంచిదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications