తెలంగాణాకు ఐఎండీ హెచ్చరిక
వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలను ఉక్కుపోత వదలడం లేదు. కొన్ని జిల్లాల్లో ప్రతీరోజూ వర్షం కురిసినట్టే ఉన్నా మళ్ళీ వాతావరణం ఎండాకాలాన్ని తలపిస్తుంది. ఇక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఆశించిన మేర లేకపోవటంతో ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు.
వరుణుడి కరుణ కోసం ఎదురుచూపులు
రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రైతులు వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కప్పతల్లి పూజలు చేస్తున్నారు. కప్పలకు పెళ్ళిళ్ళు జరిపించి వరుణ దేవా కరుణించు అంటూ పూజలు చేస్తున్నారు. సంవృద్దిగా వర్షాలు కురవాలని కోరుతున్నారు.

తెలంగాణాలో నాలుగు రోజులు వర్షాలు
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మరో మూడు నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో చెదురుమదురు వర్షాలు పడుతుండగా ఈరోజు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
నేడు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
నేడు తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
జులై 17 వరకు వర్షాలకు ఛాన్స్
ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు తోడు, ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. జులై 17వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
నిన్న హైదరాబాద్ లో వర్షం
ఇది ఇలా ఉంటే నేడు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నేడు కూడా సాయంత్రం వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications