Telangana Rains: తెలంగాణాకు బంగాళాఖాతం పంపిన మేఘసందేశం!

చలికాలం ప్రారంభం అయినా సరే తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో నేడు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.

తెలంగాణాలో వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న నైరుతి బంగాళాఖాతం ఏపీ దక్షిణ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఇక నేడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్ష ప్రభావం కొనసాగుతుందని పేర్కొంది.

Telangana rains update rains in these districts today and tomorrow IMD alert

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రేపు ఈ జిల్లాలలో వర్షాలు
ఇక రేపు కూడా అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణా వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన
ఇక నవంబర్ రెండవ తేదీ నుండి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. అయితే ఎటువంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. హైదరాబాద్లో కూడా ఉరుములువైరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లో నేడు తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+