Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రీతి మృతిపై కాళోజీ వర్సిటీకి గవర్నర్ తమిళిసై కీలక ఆదేశాలు

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి నేపథ్యంలో కాళోజీ విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాజ్‌భవన్ లేఖ రాసింది.

హైదరాబాద్: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి నేపథ్యంలో కాళోజీ విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాజ్‌భవన్ లేఖ రాసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాలని వెల్లడించింది.

ర్యాగింగ్ వేధింపుల తరహాలో ఘటనలు జరిగినప్పుడు తీసుకునే చర్యలకు సంబంధించిన ఎస్ఓపీలపై సమగ్ర నివేదిక అందించాలని రాజ్ భవన్ కోరింది. మెడికలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటలు.. మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరుపైనా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Telangana raj bhavan wrote a letter to kaloji university of preethi death issue

ప్రీతిని నిమ్స్ కు తరలించడంలో అత్యంత కీలకమైన సమయాన్ని కోల్పోయినట్లు లేఖలో రాజ్ భవన్ పేర్కొంది. ఆమెను నిమ్స్ కు తరలించకుండా వరంగల్ ఎంజీఎంకే వైద్య నిపుణులు, అత్యాధునిక పరికరాలను తరలించి మెరుగైన చికిత్స అందించాల్సిందని అభిప్రాయపడింది.

డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని సమాచారం ఇచ్చిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రీతి ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించారని యూనివర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉదాసీనత లేకుండా.. తక్షణం స్పందించి కాలేజీలలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మహిళా మెడికోల కోసం కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.

కాగా, ఇటీవల సీనియర్ సైఫ్ వేధింపులతో ప్రీతి హానికరమైన ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+