Special Buses : సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్లేవారికి శుభవార్త. ఏపీకి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి (Sankranti) అంటేనే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పండక్కి ఎక్కడున్నా ఇంటికి రావాల్సిందే. అందుకే మూడు నెలల ముందు నుంచే సొంతూళ్లకు చేరేందుకు టికెట్ బుక్ చేసుకుంటుంటారు. ఎన్ని ప్రత్యేక రైళ్లు వేసినా స్పెషల్ ట్రైన్స్ ఎప్పటికో వెళ్లతాయని భావనతో ప్రజలు సొంత వాహనాల్లో లేదా ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులలో గ్రామాలకు పయనమవుతారు. ఇప్పటికి హైదరాబాద్ లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోయింది. క్రిస్మస్ కు ముందే కొందురు సొంతూర్లు చేరారు. అయితే ఇప్పటికే ఆర్టీసీ బస్సులన్ని బుక్ అయిపోగా.. స్పెషల్ బస్సుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ఆర్సీసీ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతికి ఊరు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క, రెగ్యులర్ బస్సులు నిండిపోవడంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బీహెచ్‌ఈఎల్‌ (BHEL), మియాపూర్ వైపు నివసిస్తూ విజయవాడ, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర వెళ్లే వారికి ఇది చాలా మంది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. నేరుగా బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి ఏపీకి స్పెషల్ సర్వీసులను ప్రారంభమవుతాయని బీహెచ్‌ఈఎల్‌ డిపో (ఆర్సీపురం) డీఎం తెలిపారు.

పిక్ అప్ పాయింట్స్..

BHEL నుంచి ఏపీలోని పలు జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులు వేస్తున్నారు. ఈ సర్వీసులు BHEL నుంచి మియాపూర్‌, కేపీహెచ్‌బీ (KPHB) వరకు ఉన్న వారికి ఎక్కించుకుంటాయి. ఎవరు బుక్ చేసుకున్నా.. కేపీహెచ్‌బీ చివరి పికప్ పాయింట్. తర్వాత హైదరాబాద్ సిటీలోకి వెళ్లకుండా నేరుగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా ఏపీ వైపు ప్రయాణిస్తాయి. ఈ ప్రత్యేక బస్సలును విజయవాడ, గుంటూరు, చీరాల, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, పోలవరం తో పాటు రాయలసీమకు కూడా కొన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Telangana RTC Announces Special Sankranti Bus Services from BHEL Depot to Andhra Pradesh

ఎలాంటి అధిక ఛార్జీలు లేకుండా..

జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ ఈ ప్రత్యేక సర్వీసులు ఏపీకి నడుస్తాయని తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ బస్సుల కోసం పూర్తి వివరాలకోసం 9959226149 క నెంబరును సంప్రదించవచ్చు. ఎలాంటి అధిక ఛార్జీలు లేకుండా తెలంగాణ ఆర్టీసీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుని సాధారణ రేట్లకే బస్సులు ఏర్పాటు చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్న తరుణంలో ఈ సదవకాశాన్ని అందరూ వినియోగంచుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరుతుంది. అలాగే రద్దీని బట్టి అదనపు బస్సులను పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టత ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+