TGSRTC Jobs: శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. త్వరలో 3035 ఉద్యోగాల భర్తీ..

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. టీజీఎస్ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఒకే చెప్పినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌), 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌(ట్రాఫిక్‌), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌), 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌, 11 సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(స్పెషాలిస్ట్‌) ఉద్యోగాలు ఉన్నాయి.

ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్‌ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని పొన్నం చెప్పారు.

Telangana RTC has approved the recruitment of 3035 posts

ఈ కొత్త రక్తంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని వివరించారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామని పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో హైదరాబాద్ లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రికల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. త్వరలోనే 450 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నట్లు ప్రకటించింది.

ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీతో పాటు హైదరాబాద్ విజయవాడ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు నడిపారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నడపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+