Telangana SSC Exams 2026: మార్చి 16 నుంచి తెలంగాణ టెన్త్ పరీక్షలు-షెడ్యూల్ రిలీజ్..!
తెలంగాణలో ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు వచ్చే ఏడాది జరిగే పరీక్షల కోసం టైం టేబుల్ విడుదల చేశారు. ఈ మేరకు తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు ఇవాళ పరీక్షల తేదీల్ని వెల్లడించింది. ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప ఈ టైంటేబుల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 16 నుంచి పదో తరగతి విద్యార్ధులకు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇవాళ ప్రకటించిన టేం టేబుల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 16న తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా, కాంపోజిట్ కోర్సు) పరీక్ష ఉంటుంది. మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ ( హిందీ, తెలుగు, స్పెషల్ ఇంగ్లీష్ ) పరీక్ష ఉంటుంది. మార్చి 21న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 23న మ్యాథ్స్ పరీక్ష ఉంటుంది. మార్చి 25న ఫిజికల్ సైన్స్ పరీక్ష, 28న బయోలజీ పరీక్ష, 30న సోషల్ పరీక్షలు ఉంటాయి.

మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అంటే కాంపోజిట్ కోర్సు వారికి పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు ఓఎస్ఎస్సీ వారికి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 అంటే సంస్కృతం, అరబిక్, పర్షియా భాషల పేపర్ పరీక్ష కూడా ఉంటుంది. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ వారికి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 అంటే సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల పేపర్ల పరీక్ష ఉంటుంది. దీంతో పాటు ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సు పరీక్ష కూడా ఇదే రోజు నిర్వహిస్తారు.
భాష పరీక్షలతో పాటు మ్యాథ్స్, సోషల్ పరీక్షలు ప్రతీ రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ నిర్వహిస్తారు. ఫిజిక్స్, బయోలజీ, ఎస్సెస్సీ ఒకేషనల్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకూ ఉంటాయి. రంజాన్, ఉగాది పండుగ తేదీల్ని బట్టి పరీక్ష తేదీల్లో మార్పులు ఉండొచ్చని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications