సెప్టెంబర్ 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానున్నాయి. గత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అనంతరం సీఎం కేసీఆర్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసగించనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరగనున్న సమావేశాలు కానుండడంతో మరింత వేడిగా కొనసాగనున్నాయి.

Telangana state assembly sessions are scheduled to start September 9,

సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు చేశారు..అధికారులతో నాలుగు రోజుల క్రితం సమావేశమైన దేశావ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేయాలని సీఎం అధికారులకు సూచించారు.ఈ నేపధ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదాయం తగ్గిందని చెప్పిన ఆయన ఆర్ధిక మాంద్యానికి పలు రంగాలపై ప్రభావం పడిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఆదాయాలు బాగా తగ్గిపోయాయని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయాలతో పాటు అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. రానున్న బడ్జెట్ పూర్తిగా వాస్తవ రూపంలో ఉండాలని చెప్పిన ఆయన వ్యవసాయం, ప్రజాసంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివాడిగా కొనసాగనున్నాయి. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల అంశంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఇంటర్ మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనలు,కాంగ్రెస్ పార్టీ విలీనం లాంటీ సమస్యలపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టనుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగుతున్న అసెంబ్లీ సమావేశాలు కావడంతో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహరించ నుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+