ఇక టీఎస్‌పీఎస్సీ కాదు.. టీజీపీఎస్సీ: గ్రూప్ 1 ప్రిలిమ్స్ 9న, 1 నుంచి హాల్ టికెట్లు
తెలంగాణ ప్రభుత్వం అధికారిక కమ్యూనికేషన్‌లో టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ని టీజీపీఎస్సీ(TGPSC)గా మారుస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా పిలవబడిన టీఎస్‌పీఎస్సీ.. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మారింది.
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి
టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. జూన్ 9వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఇక, ఈ పరీక్షకు 30 నిమిషాల ముందే అంటే ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న గేట్లు మూసివేస్తారని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి ప్రతి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలెటర్లు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటారని చెప్పారు. ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ విధానంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. నమూనా ఓఎంఆర్ షీట్‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications