ప్రజలు సరదాగా రారు: పోలీసుల తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పోలీసులు ఉన్నది ప్రజల కోసం.. వారిని భయాందోళనలకు గురిచేయడానికి కాదని హైకోర్టు సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ప్రవర్తన మార్చుకునేలా, వారి విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి చెప్పాలని అదనపు ఏజీకి హైకోర్టు సూచించింది.
పోలీస్ స్టేషన్‌కు పౌరులు సరదాగా రారని.. న్యాయవాదులు, డాక్టర్లతో పాటు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లాలని కోరుకోరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందని, ఇకపై కేసు నమోదు చేయలేదంటూ ఎవరూ కోర్టుకు రాకుండా డీజీపీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా.. కరీంనగర్ రెండో పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది.

కోర్టు ఆదేశాలతో ఎస్‌హెచ్‌వో ఓదెల వెంకటేశ్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ వాదనలు వినిపిస్తూ.. 14న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరపున ఏఏజీ క్షమాపణ కోరారు. దీంతో ఎస్‌హెచ్‌వోను వదిలిపెట్టలేమని ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వివరణ ఇచ్చుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఉద్యోగం నుంచి తొలగించినందుకు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చారని చెబుతున్నారు. ఒకవేళ అది తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలున్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయిని తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున పిటిషన్ పై అభ్యర్థనలను మూసి వేస్తున్నామని, ఎస్‌హెచ్ఓ వివరణ నిమిత్తం విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణాలేమిటో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications