తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్: నేటి నుంచి అందుబాటులోకి హాల్ టికెట్లు

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే హెల్ప్‌డెస్క్ 040-23120340, 040-23120433 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరగనుంది.

Telangana TET hall tickets released today

అభ్యర్థులు త‌మ హాల్ టికెట్‌పై ఫోటో రానిప‌క్షంలో.. పాస్‌పోర్టు సైజు ఫోటో అతికించి, గెజిటెడ్ ఆఫీస‌ర్ చేత సంత‌కం చేయించాలి. అనంత‌రం ఆ హాల్ టికెట్‌ను డీఈవోకి స‌మ‌ర్పిస్తే, ప‌రిశీలించి ప‌రీక్ష‌కు అనుమ‌తి ఇస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.inలో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబ‌ర్, పుట్టిన తేదీని నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌కు 30 మార్కులు, జనరల్‌ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్‌ 30, మిగిలిన సబ్జెక్టులకు 60 మార్కుల చొప్పున కేటాయించారు.

టెట్‌కు 20 శాతం వెయిటేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. టెట్ ఫలితాలను సెప్టెంబర్ 27న వెల్లడించనున్నారు. టీఎస్‌ టెట్‌-2023 నోటిఫికేషన్‌ ఆగస్టు 1న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు జరిగింది. మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

కాగా, ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 5089 పోస్టులను భర్తీ చేస్తోంది. దీనికి సంబంధినంచిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+