మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం- కొత్తగా 121 ఫారిన్ లిక్కర్ బ్రాండ్లు ఎంట్రీ, ధరలు..!!

మందు బాబుకు ఎక్సైజ్ శాఖ తీపి కబురు చెబుతోంది. కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. విస్కీ, వైన్, వోడ్కా, బ్రాందీ, జిన్ మరియు టకీలా విభాగాలతో పాటు వివిధ రకాల బీర్లకు సంబంధించి ఏకంగా 121 రకాల బ్రాండెడ్ మద్యం రాష్ట్రంలో ఎంట్రీకి రంగం సిద్దం అయింది. దీంతో, తయారీ కంపెనీలు కొత్త పేర్ల (లేబుళ్ల) నమోదు కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించాయి. కాగా.. ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయడానికి సెప్టెంబర్ 1 వరకు గడువు విధిస్తూ ఎక్సైజ్ శాఖ ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

తెలంగాణ లో కొత్తగా మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఫారిన్ బీర్లు.. లగ్జరీ లిక్కర్ మార్కెట్ లోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యాయి. కొత్తగా అందుబాటులోకి రానున్న బీర్ల జాబితాలో చీతా, టైగర్, రెడ్ హార్స్, అబెస్ట్, ఫ్లెన్స్బర్గర్, భూటానిస్ మరియు కకావోస్ వంటి అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లు ఉన్నాయి. వీటితో పాటు ప్రీమియం కేటగిరీకి చెందిన విస్కీలు, రకరకాల వోడ్కా మరియు వైన్ బ్రాండ్లు కూడా త్వరలోనే వినియోగంలోకి తీసుకొచ్చేలా కసరత్తు జరుగుతోంది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న లేబుళ్లపై సెప్టెంబర్ 1 లోపు ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే, ఎక్సైజ్ శాఖ వీటి విక్రయాలకు ఆమోదం తెలపనుంది. సెప్టెంబర్ తదుపరి వారాల్లో ఈ కొత్త బ్రాండ్లు అధికారికంగా మద్యం దుకాణాలు, పబ్‌లు మరియు బార్లలో విక్రయాలకు సిద్దం అవుతున్నాయి.

 కొండా వివాదం వేళ విదేశాల నుంచి వస్తూనే రేవంత్ బిగ్ డెసిషన్- ముహూర్తం ఫిక్స్..!!
కొండా వివాదం వేళ విదేశాల నుంచి వస్తూనే రేవంత్ బిగ్ డెసిషన్- ముహూర్తం ఫిక్స్..!!
telangana-tgbcl-speeds-approval-of-121-new-liquor-brands-from-18-suppliers-here-the-details

సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి

మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులతో పాటు గ్లోబల్ బ్రాండ్లను తెలంగాణ వినియోగదారులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగుతోంది. కొత్తగా అనుమతులు కోరుతున్న జాబితాలో 12, 15, 18, 21 ఏళ్ల నాటి సింగిల్ మాల్ట్ విస్కీలు, మంకీ షోల్డర్, హెండ్రిక్స్ జిన్, టైగర్ లాగర్ బీర్లతో పాటు కొరియన్, జర్మన్ బ్రాండ్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అంతర్జాతీయ ఉత్పత్తులతో పాటే దేశీయంగా తయారయ్యే ఆర్థోస్ కలెక్టివ్ మాల్ట్ విస్కీ, స్మోక్ ల్యాబ్ వోడ్కా, శంకర్ డిస్టిలర్స్ వర్చాస్ అమెరికన్ విస్కీ, రీకో, వల్లోన్ కంపెనీల ఫ్లేవర్డ్ వైన్లు కూడా ఓపెన్ మార్కెట్ లో అడుగు పెట్టేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు తుది కసరత్తు కొనసాగుతోంది. అయితే.. ధరలు ప్రస్తుతం పోటీగా ఉన్న ఇతర బ్రాండ్ల తరహాలోనే ఉంటాయని చెబుతున్నారు. ఇక.. వచ్చే వారం నుంచి ఈ కొత్త బ్రాండ్లు మందుబాబుటకు అందుబాటులో ఉండనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+