తెలంగాణలో వచ్చే రెండ్రోజులపాటు ఈ జిల్లాల్లో వర్షాలు
ఎండ వేడిమి, వడగాలులు, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. గురువారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
గురువారంనాడు వరంగల్, నారాయణపేట, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సంగారెడ్డి, కామారెడ్డి, కుమురంభీమ్, ఆదిలాబాద్, మంచిర్యాలలో అక్కడక్కడా వానలు కురిశాయి. కాగా, శుక్రవారంనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతామని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీమ్ అసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డిలో శనివారంనాడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 14న ఆదివారంనాడు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
@CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #ECISVEEP #CEO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/UnR4WdJIaK
— IMD_Metcentrehyd (@metcentrehyd) April 12, 2024
అయితే, పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ.. గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం 42 డిగ్రీల సెల్సియస్ కు పైగానే నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని షేక్ పేటలో 39.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ కు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications