వార్నీ..హైదరాబాద్ యూత్ ఘనకార్యం:ఫుడ్ పాకెట్సే కాదు..మద్యం కూడా: కూలీల కోసం ఖరీదైన లిక్కర్
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్న నేపథ్యంలో.. దినసరి వేతన కూలీలు, రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికుల కోసం యువకులు స్వచ్ఛందంగా ఆహారాన్ని అందజేస్తోన్న ఉదంతాలను ఎన్నో చూశాం. జీవనోపాధిని కోల్పోయిన వారిని వెదుక్కుంటూ మరీ వెళ్లి.. వారికి ఒకపూట భోజనం పెట్టిన సందర్భాలను చూసి వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాం. పండ్లు, కూరగాయలను క్యారీబ్యాగుల్లో పెట్టి మరీ పంచిన సంఘటనలు ఉన్నాయి.
Recommended Video
హైదరాబాదీ యూత్ డిఫరెంట్..
ఆహార పాకెట్లనో, కూరగాయల సంచులనో పంచి బోర్ కొట్టినట్టుంది కొందరు హైదరాబాదీ యువతకు. అందుకే- తమ బుర్రకు పదును పెట్టారు. రొటీన్‌కు భిన్నంగా.. కాస్త డిఫరెంట్‌గా థింక్ చేశారు. ఫుడ్ పాకెట్లకు బదులుగా ఖరీదైన మద్యాన్ని పంచాలని డిసైడ్ అయ్యారు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దాన్ని అమల్లోకి పెట్టారు. అడ్డా మీద ఉండే కూలీల కోసం కారులో వెదుక్కుంటూ మరీ వెళ్లి.. మద్యాన్ని పంచారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హైదరాబాద్ శివార్లలో..
హైదరాబాద్ శివార్లలోని చంపాపేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రోడ్డు పక్కన..మూసివున్న దుకాణ సముదాయాల కింద సేద తీరుతున్న కొందరు వలస కార్మికులు, దినసరి వేతన కూలీలకు మద్యాన్ని పంచడం కనపించింది. ఖరీదైన మద్యాన్ని కొనుగోలు చేసిన ఆ యువకులు దాన్ని ప్లాస్టిక్ గ్లాసుల్లో పోసి మరీ వారికి అందజేశారు. చాలా.. ఇంకా కావాలా? అని అడిగి మరీ మద్యాన్ని పంచారు. మహిళలకు కూడా మద్యాన్ని అందించడం కనిపించింది.

వైరల్‌గా మారిన వీడియోలు..
దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హల్‌చల్ చేస్తున్నాయి. ఆ యువకులు చేసిన చర్యల పట్ల.. వారి ఐడియాలాగే డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు నెటిజన్లు. కొంతమంది మెచ్చుకుంటుండగా.. మరి కొంతమంది తిడుతున్నారు. లాక్‌డౌన్ వల్ల మద్యం దొరక్క కొందరు పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారని, ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆసుపత్రిలో చేరుతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వారికి ఖరీదైన మద్యాన్ని అందించడం సరైన చర్యగా ప్రశంసిస్తున్నారు. మరికొందరు వారు చేసిన పనిని విమర్శిస్తున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications