రాత్రికి రాత్రే రూ. 240 కోట్లకు అధిపతైన ఖమ్మం కుర్రాడు
శ్రమకు ప్రతిభ తోడైతే విజయం దక్కుతుంది. కానీ ఆ అదృష్టం కూడా తోడైతే, ఏకంగా రూ.240 కోట్ల భారీ సంపద వచ్చి తలుపు తడుతుంది.ఇది నమ్మశక్యం కాని కథ, తెలంగాణ యువకుడు, యూఏఈలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్‌కుమార్ నిజ జీవితంలో అద్భుతం జరిగింది.
ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్, రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. తన ప్రతిభతో విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డారు. తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉన్నా, ఈసారి మాత్రం తన తల్లి పుట్టిన తేదీ సంఖ్యను ఎంచుకున్నారు. కుటుంబం పట్ల అనిల్‌కు ఉన్న ఈ సెంటిమెంట్, అతని జీవితంలో అత్యంత విలువైన పెట్టుబడిగా మారింది.

ఆ ఒక్క టికెట్, అతనికి ఏకంగా 240 కోట్ల రూపాయల బహుమతిని తెచ్చిపెట్టింది. రాత్రికి రాత్రే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. కష్టం విలువ తెలిసిన కుటుంబానికి, ఈ భారీ మొత్తం తరతరాలు గడిచేంత ఆర్థిక భద్రతను అందిస్తుంది అనడంలో సందేహం లేదు.
అనిల్ కుమార్ విజయం నిజంగా సంతోషించదగిన విషయం అయినప్పటికీ, ఇలాంటి కథనాలు చూసి చాలామంది సాధారణ ప్రజలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. అందుకే, ఆర్థిక నిపుణులు లాటరీల విషయంలో ప్రజలను హెచ్చరిస్తున్నారు. లాటరీ గెలిచిన కొద్దిమంది గురించే వార్తలు వస్తాయి. కానీ, లాటరీలలో డబ్బు కోల్పోయి, అప్పుల పాలైన లక్షలాది మంది నష్టపోయిన కథలు వెలుగులోకి రావు.
లాటరీ కొనుగోలు అనేది ఒక రకమైన జూదం లాంటిది. ఇది ఒక వ్యసనంగా మారితే, మొత్తం సంపాదనను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంటుంది.అదృష్టం అనేది కేవలం అరుదుగా మాత్రమే తలుపు తడుతుంది. అందువల్ల, అనిల్ కుమార్ కథను ఒక అద్భుతంగా మాత్రమే చూడాలి కానీ, దాన్ని అనుకరించి లాటరీ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications