అమెరికాలో వరంగల్ విద్యార్థి కాల్చివేత, కారు ఎత్తుకెళ్లారు: పేరెంట్స్ కన్నీరు
అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు విద్యార్థి వంశీచంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నల్లజాతి దుండగులు జరిపిన కాల్పులలో అతను మృతి చెందాడు.
వరంగల్/హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు విద్యార్థి వంశీచంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నల్లజాతి దుండగులు జరిపిన కాల్పులలో అతను మృతి చెందాడు.
వంశీచంద్ రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన విద్యార్థి. వంశీచంద్ మృతి విషయం తెలిసి తల్లిదండ్రులు ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘటనతో వంగపహాడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వంశీచంద్ రెడ్డి భువనగిరి వాత్సల్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఎంఎస్ చదివేందుకు కాలిఫోర్నియాకు రెండేళ్ల క్రితం.. అంటే 2015 సెప్టెంబర్ నెలలో వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసిన వంశీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఈ క్రమంలో అతను నల్ల జాతి దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. అతను కారులో వెళ్తుండగా.. డ్రగ్స్ తీసుకున్న దుండగులు అడ్డగించి, అతని పైన కాల్పులు జరిపి, కారు ఎత్తుకెళ్లారు. అతని మృతదేహాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ అక్కడి వారితో సంప్రదింపులు జరిపారు. కాగా, వంశీచంద్ రెడ్డిని హత్య చేసిన చోటే మరొకరి పైన తాజాగా దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications