హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెచ్‌ఐసీసీ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత; ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్; అరెస్ట్ చేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు గా, హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న హెచ్ఐసిసి మాదాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని మోడీతో పాటు జాతీయ నేతలు హెచ్ఐసీసీకి వస్తున్న నేపధ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మోడీ పర్యటన నేపధ్యంలో నాలుగంచెల భద్రత కల్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే అగ్నిపథ్ పథకంపై గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తున్న వేళ, హోంమంత్రి అమిత్ షా ను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు హెచ్ఐసీసీ ముట్టడికి ప్రయత్నించారని తెలుస్తుంది. మాదాపూర్ హెచ్ఐసీసీ సిగ్నల్ పాయింట్ వద్ద ఒక్కసారిగా యూత్ కాంగ్రెస్ నేతలు రావటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా, కేంద్ర మంత్రులు వస్తున్న హెచ్ఐసీసీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేసిన క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి తో పాటుగా, పలువురు యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 Tension at HICC; Youth Congress leaders tried to block Amit shah, police arrested leaders

అయితే ఈ రోజు ఉదయం మాదాపూర్ లోని RB రెస్టారెంట్ లో టిఫిన్ చేస్తున్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డిని & ఇతర యూత్ కాంగ్రెస్ నేతలను మఫ్టీలో వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని అరెస్ట్ చేయడాన్ని యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉన్నా తెలంగాణా డీజీపీ వెంటనే విడుదల చేయాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరపున హెచ్చరిస్తున్నామని తెలంగాణ యూత్ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

English summary
https://telugu.oneindia.com/news/telangana/prakash-raj-satires-on-pm-modi-posted-those-photos-and-targeted-as-dear-supreme-leader-321160.html
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X