Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అట్టుడుకుతున్న కామారెడ్డి.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయన్న కేంద్రమంత్రి

కామారెడ్డిలో ఉద్రిక్తతలు చల్లారలేదు. కామారెడ్డి వెళ్లడానికి ప్రయత్నం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బిజెపి నేతలు తాము కామారెడ్డి వెళ్లి తీరుతామని స్పష్టం చేయడంతో పోలీసులు అన్ని ప్రధాన రహదారులు, తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వారు రాకుండా అడ్డుకుంటున్నారు. కామారెడ్డి కి వెళ్లాలని ప్రయత్నిస్తున్న ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

కామారెడ్డిలో చల్లారని ఉద్రిక్తతలు

కామారెడ్డిలో మొదలైన రాజకీయ ఉద్రిక్తత ఇంకా చల్లారలేదు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో వివాదం చిలికి చిలికి గాలివానగా మారి సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకునే దాకా వెళ్ళింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన పోసానిపేట మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి తన కారుతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Tension in Kamareddy Bandi Sanjay Slams House Arrests Alleges Emergency-Like Situation in telangana

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందా? భగ్గుమన్న బండి సంజయ్

బిజెపి కార్యకర్తలు కారును ధ్వంసం చేశారు. పరిస్థితిని కంట్రోల్ చేయటానికి పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ఎవరు కామారెడ్డికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.ఇక దీనిపైన కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందా ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేమిటి అంటూ నిలదీశారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు

రాష్ట్రంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని, ఎంఐఎం తో కలిసి కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని బండి సంజయ్ అన్నారు. ఈ అరాచకాలను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకోవాలని, కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దారుణమని బండి సంజయ్ అన్నారు.

బాన్సువాడలో 70 మంది అరెస్ట్ అక్రమం అన్న కేంద్రమంత్రి

బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషమని, కామారెడ్డి లో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ఆత్మరక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటన్నారు. బాన్సువాడలో 70 మందిని అరెస్ట్ చేయడం అక్రమమని, రాళ్ళ దాడి స్పష్టంగా కనిపిస్తున్న చర్యలు ఎందుకు లేవని బండి సంజయ్ ప్రశ్నించారు. బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. ఎంఐఎం ను కాపాడడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్నారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+