హైదరాబాద్ మెట్రో కొత్త రూట్ ఫిక్స్..!!
హైదరాబాద్ మెట్రో విస్తరణకు రంగం సిద్దమైంది. ముఖ్యమంత్రి రేవంత్ మెట్రో విస్తరణ పైన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సిటీ నుంచి ఫోర్త్ సిటికి రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సిటీకి రహదారి, మెట్రో రైలు మార్గాలను నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆ విధంగా నగరంలో కొత్త మెట్రో రూటుకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీపీఆర్ సిద్దం చేయాలని నిర్దేశించారు.
రంగారెడ్డి జిల్లాలోని బెగరికంచ ప్రాంతాన్ని.. ఫ్యూచర్ సిటిగా అభివృద్ది చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. బెగరికంచ సిటీకి విదేశాల నుంచి రూ. వేల కోట్ల ఇన్వెస్ట్ మంట్లు తీసుకు వచ్చి ఆరోగ్యం, క్రీడ, ఇతర కంపెనీ హబ్ గా మారుస్తానని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నూతన నగరానికి మెట్రో రూట్ కూడా రానుంది. ఈ మొత్తం ప్లానింగ్ పైన ముఖ్యమంత్రి స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నగరంలో కొత్త మెట్రో రూటుకు శ్రీకారం చుట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రూట్ మ్యాప్ ను అధికారులు సీఎం ముందుకు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి సైతం కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ వరకు ఈ మెట్రో మార్గాన్ని అనుసంధానం ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసే క్రమంలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న ఈ చర్చల పైన ఉన్నత స్థాయి సమీక్ష లో పూర్తి స్థాయి ప్రణాళికలుగా రూపొందించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ మెట్రో విస్తరణ అంశంలో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నెలాఖరులో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications