ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ మరో శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, ఆర్టీసీ అనేక కీలక మార్పులతో ప్రగతి పరుగులు పెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో బస్సు ప్రయాణికులకు టీజిఎస్ ఆర్టిసి మరో శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరగడం వల్ల నిలబడి ప్రయాణం చేసే వారికి ఊరట లభించే విధంగా తీపి కబురు వెల్లడించింది.
టిజిఎస్ ఆర్టిసికి 2000 ఎలక్ట్రిక్ బస్సులు
త్వరలోనే టిజిఎస్ ఆర్టిసికి 2000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ వంటి నగరాలలో కాలుష్యం తగ్గించే విధంగా పీఎం ఈ డ్రైవ్ పథకం కింద కేంద్రం వీటిని మంజూరు చేసినట్టు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడం కోసం ఒలెక్ట్రా గ్రీన్ టెక్- ఈవీ ట్రాన్స్, గ్రీన్ సెల్ మొబిలిటీ సంస్థలను ఎంపిక చేశారు.

ఆగస్టు2027 లోగా ఎలక్ట్రిక్ బస్సులు
ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి లెటర్ ఆఫ్ అవార్డుపై సంతకాలు చేశారు. సెక్యూరిటీ డిపాజిట్, అగ్రిమెంట్ వంటి వాటితో ఈ బస్సుల తయారీ మొదలైంది. అనేక దఫాలుగా తెలంగాణ రాష్ట్రానికి ఈ బస్సులను సరఫరా చేస్తున్నారు. మొత్తం ఒప్పందం ప్రకారం 2024సెప్టెంబర్ నుండి ఆగస్టు2027 మధ్య ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయి.మంజూరైన రెండువేల బస్సులలో 1085 బస్సులు లో ఫ్లోర్ నాన్ ఏసీ, 60 లో ఫ్లోర్ ఏసీ బస్సులు ఉన్నాయి.
హైదారాబాద్ లో స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులు సౌకర్యవంతం
ఈ 1085 లో ఫ్లోర్ బస్సుల టెండర్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈవీ ట్రాన్స్ కు దక్కగా, 915 స్టాండర్డ్ ఫ్లోర్ బస్సుల టెండర్ గ్రీన్ సెల్ మొబిలిటీ దక్కించుకుంది. అక్టోబర్ ఒకటవ తేదీ తర్వాత అన్ని నగరాలలో లో ఫ్లోర్ బస్సులు మాత్రమే ఉండాలని కేంద్ర ఆదేశించింది. అయితే హైదరాబాద్ శివారులో స్పీడ్ బ్రేకర్ ల వల్ల స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయని ఆర్టీసీ భావిస్తుంది.
కేంద్రానికి ఆర్టీసీ ఎండీ లేఖ
ఈ క్రమంలో దీనిపైన స్పష్టత కోసం ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కేంద్రానికి లేఖ రాశారు.కేంద్రం తుది నిర్ణయాన్ని అనుసరించి 915 బస్సులను సరఫరా చేయాలని గ్రీన్ సెల్ మొబిలిటీకి షరతు విధించినట్టు తెలుస్తోంది. స్టాండర్డ్ ఫ్లోర్ కు అంగీకరించకపోతే వాటిని లో ఫ్లోర్ గానే తయారు చేయాలని ఆర్టీసీ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మొత్తంగా రెండు వేల ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే రాబోతున్నాయి అన్నది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే వారికి నిజంగానే శుభవార్త.












Click it and Unblock the Notifications