RTC: బస్సులో ప్రయాణికురాలికి అస్వస్థత.. ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆర్టీసీ సిబ్బంది..
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ సిబ్బంది మానవత్వం చాటుకుని ఆదర్శంగా నిలుస్తోంది. గత జూన్ లో ఆర్టీసీ సిబ్బంది ఓ మహిళకు ప్రసవం చేశారు. జూన్ 16న ఒడిశాకు చెందిన కుమారి, దూల దంపతులు ఖమ్మం మీదుగా ఒడిశా వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్ కు వచ్చారు. అయితే కుమారి అప్పటికే నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు రాగా.. భర్త ఆమెను చెట్టు కింద ఉంచి ఎస్ఎం అంజయ్య గౌడ్ కు చెప్పారు. అంజయ్య గౌడ్ వెంటనే స్వీపర్లను కుమారి వద్దు పంపించారు.
ఆ వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. ఇలోకా కుమారి నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుకట్టి ప్రసవం చేశారు. అక్కడి చేరుకున్న 108 సిబ్బంది తల్లీ బడ్డలను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో సంతోష్ అనే వ్యక్తికి ఫిడ్స్ వచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ బస్సును డైరెక్ట్ గా ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అతనికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

కొద్దీ రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న గర్బిణీకి నొప్పులు రావడంతో కండక్టర్, ప్రయాణికులతో కలిసి ప్రసవం చేశారు. ఇలా మానవత్వం చాటుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆర్టీసీ సిబ్బంది. తాజాగా ఆర్టీసీ సిబ్బంది మరోసారి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్-కల్వకుర్తి రూట్ బస్సులో ఆదివారం నందిని అనే మహిళా ప్రయాణిస్తుండగా.. బస్సు తుక్కుగూడ సమీపంలోకి వచ్చాక ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.
ఈ విషయాన్ని గమనించిన కల్వకుర్తి డిపో కండక్టర్ శశికళ.. డ్రైవర్ అంజయ్యను అప్రమత్తం చేశారు. బస్సును ఆపించి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు.
అంబులెన్స్ లో ఆమెని కడ్తాల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రయాణికురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. బస్సులో కడుపు నొప్పితో బాధపడుతున్న ప్రయాణికురాలికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకున్న కల్వకుర్తి డిపో కండక్టర్ శశికళ, డ్రైవర్ అంజయ్యను #TGSRTC ఎండీ వీసీ సజ్జనర్ ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు మానవత్వం చాటుకోవడంలోనూ తామేమీ తక్కువ కాదని ఆర్టీసీ సిబ్బంది నిరూపిస్తుండటం సంతోషదాయకని అన్నారు.
బస్సులో ప్రయాణికురాలికి అస్వస్థత.. ఆర్టీసీ సిబ్బంది ఉదారత!!
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) November 17, 2024
బస్సులో తీవ్ర అవస్థకు గురైన ప్రయాణికురాలిని సకాలంలో ఆస్పత్రికి తరలించి #TGSRTC సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు.
హైదరాబాద్-కల్వకుర్తి రూట్ బస్సులో ఆదివారం నందిని అనే మహిళా ప్రయాణిస్తుండగా.. బస్సు తుక్కుగూడ సమీపంలోకి… pic.twitter.com/itovGCg1WT












Click it and Unblock the Notifications