BRS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రావు..

రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రావులను ప్రకటించారు. వీరు పేర్లను గవర్నర్ కు పంపించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గవర్నర్ ఆమోదం తెలిపితే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అయితే తనకు సరైదన ప్రాధాన్యత లేదంటూ ఆయన కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ లో కొద్ది సంవత్సరాలు పని చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే పీజేఆర్ కూతురు విజయ కాంగ్రెస్ లో చేరడంతో శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చాడు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉన్న శ్రవణ్ తిరిగి బీఆర్ఎస్ లో చేరాడు. ఆయన ఎమ్మెల్సీ హామీతో బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిస్తోంది. మరో ఉద్యమ నాయకుడు స్వామి గౌడ్ కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ లేదా వచ్చే ఎన్నికల్లో ఏదైనా నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.

Dasoju Shravan and Kurra Satyanarayana Rao

కాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ దాదాపు ఆరుగంటల పాటు జరిగింది. ఈ కేబినేట్ భేటీలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును ఆగస్టు 3 నుంచి జరిగే సమావేశాల్లో పెడతామని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్‌ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

రాయదుర్గం - విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్‌ ప్రక్రియ జరుగుతోందని కేటీఆర్ చెప్పారు. ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక జేబీఎస్‌ నుంచి తూంకుంట వరకు, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. డబుల్ డెక్కర్ మెట్రోలో ఓ వరుసలో వాహనాలు నడుస్తాయి. మరో వరుసలో మెట్రో ట్రైన్లు నడుస్తాయి. మెట్రో నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం ఉండాలని కేటీఆర్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+