తెలంగాణ కొత్త ఎస్పీల జాబితా వ‌చ్చేసింది...

తెలంగాణలోని ప‌లు జిల్లాల‌కు కొత్త ఎస్‌పీలు రాబోతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక జాబితాను పంపింది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఈసీ ఆదేశాల మేరకు తప్పించిన అధికారుల స్థానంలో కొత్తవారికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. దీంతో నిన్న సాయంత్రం ఈసీకి అధికారుల జాబితాను పంపారు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. సీఎస్ పంపిన జాబితా ఆధారంగా ప‌ది జిల్లాలకు ఎస్పీల నియామాకాన్ని ఖరారు చేసింది ఈసీ.

13 జిల్లాల ఎస్పీలు : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంగా నాలుగు జిల్లాల కలెక్టర్లు, ప‌ద‌మూడు జిల్లాల ఎస్పీలు, ముగ్గురు సీపీలను విధులనుండి ఈసీ తప్పించిన విష‌యం తెలిసిందే. ఈ అధికారుల స్థానంలోనే కొత్త అధికారులను నియమించేందుకు అధికారుల జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఈసీ ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా కొత్త జాబితాను పంపారు శాంతికుమారి. తెలంగాణలో ఈ నెల మొదటి వారంలో మూడు రోజుల పాటు సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం పర్యటించింది.

The list of new SPs of Telangana has come...

ఈ సమయంలో తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సుధీర్ఘకాలం పాటు ఒకే చోట పనిచేసే అధికారులతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కొందరి అధికారుల జాబితాను కాంగ్రెస్ నేతలు సీఈసీ బృందానికి అందించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంగా రాష్ట్రంలో పలువురు అధికారులపై ఈసీ వేటువేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల నుండి తప్పించిన వారికి ఎలాంటి బాధ్యతలు కేటాయించవద్దని ఈసీ తేల్చి చెప్పింది.

సీఎస్ పంపిన జాబితా ఆధారంగా ప‌ది జిల్లాలకు ఎస్పీల నియామాకాన్ని ఖరారు చేసింది. ఆ జాబితాలో ఉన్న‌వారేవ‌రో చూద్దాం.

కొత్తగా నియమితులైన అధికారులు..

వరంగల్ సీపీ- అంబర్ కిషోర్ ఝా
సంగారెడ్డి సీపీ- రూపేష్
నాగర్ కర్నూల్ - వైభవ్ గైక్వాడ్
జగిత్యాల - సంప్రీత్ సింగ్
మహబూబ్ నగర్ -హర్షవర్ధన్
నారాయణపేట- యోగేష్ గౌతమ్
నిజామాబాద్- కల్మేశ్వర్
జోగులాంబ- రితీరాజ్
మహబూబాబాద్- పాటిల్ సంఘం సింగ్
కామారెడ్డి- సింధూశర్మ
భూపాలపల్లి- కారే కిరణ్
సూర్యాపేట- రాహుల్ హెగ్డే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+